రాజోలు మండలం తాటిపాకలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షం కురిసింది. గంటసేపు కురిసిన ఈ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేసవి తాపానికి సతమతమవుతున్న ప్రజలు సేద తీరారు. అకస్మాత్తుగా కురిసిన వానకు వ్యాపారస్థులు ఇబ్బందులు పడ్డారు. ముమ్మరంగా సాగుతున్న మట్టి పనులు నిలిచిపోయాయి.