కోనసీమలోని తీర ప్రాంత మండలాలైన కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, ఐ.పోలవరంలలో తాబేళ్లవేట, అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఒడిశా, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో వీటికి అధిక డిమాండ్ ఉండటంతో, స్మగ్లర్లు కంటైనర్ల ద్వారా వీటిని తరలిస్తున్నారు. స్థానిక వేటగాళ్ల నుంచి సేకరించిన తాబేళ్లను గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటిస్తున్నట్లు సమాచారం. అక్రమ రవాణాను అరికట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.