మామిడికుదురు మండలం గోగన్నమఠం నల్లివారి మెరకలో జరిగిన అగ్ని ప్రమాదంలో సోమవారం తాటాకు ఇల్లు దగ్ధమైంది. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్పారు. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ ప్రమాదంలో ఉప్పాడి సుభద్ర సర్వం కోల్పోయి కట్టుబట్టలతో వీధిన పడింది.