మామిడికుదురు మండలం గోగన్నమఠం-మగటపల్లి గ్రామాల మధ్య ఉన్న కడలి డ్రైన్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని నగరం పోలీసులు గురువారం తెలియజేశారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీఆర్వో సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.