మామిడికుదురు: ONGC బావుల వద్ద పొంచివున్న ప్రమాదం

మామిడికుదురు మండలం నగరం, పాసర్లపూడి, పాసర్లపూడిలంక, గెద్దాడలలోని ONGC బావుల వద్ద భద్రతా లోపం వల్ల ప్రమాదం పొంచి ఉందని స్థానికులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. బావుల చుట్టూ ఫెన్సింగ్ వేసి వదిలేయడంతో దట్టంగా పొదలు పెరిగాయని, ఆకతాయిలు క్రికెట్ ఆడటం, పశువులు మేపడం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా పొగతాగితే భారీ ప్రమాదం జరిగే ముప్పు ఉందని, అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్