మలికిపురం: రూ. 6 కోట్లతో డ్రైన్ అభివృద్ధికి ప్రతిపాదనలు

మలికిపురం మండలం శంకర గుప్తం డ్రైన్ సమస్యపై ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. మలికిపురానికి చెందిన బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస నగేష్ ఎమ్మెల్సీని కలిశారు. ఎమ్మెల్సీ ఫోన్ లో ఎస్ఈతో మాట్లాడారు. డ్రైన్ అభివృద్ధికి రూ. 6 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించామని ఎస్ఈ చెప్పారు. కొన్ని నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్సీకి చెప్పారు.

సంబంధిత పోస్ట్