రాజోలు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన ఘటన గురువారం రాజోలులో జరిగింది. తెన్నేటి నగర్ కు చెందిన పొన్నపల్లి పురుషోత్తం (72) హోటల్ కు వెళ్తుండగా ఒక మోటార్ సైకిల్ వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్