రాజోలు: దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వచ్చిన వెంటనే దివ్యాంగులకు అండగా నిలిచేందుకు వారి పెన్షన్ ను రెట్టింపు చేస్తుందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని 385 మంది దివ్యాంగులకు ఉపకరణాలను శుక్రవారం ఆయన అందించారు. ఆరాంకో కంపెనీ అందించిన 680 వస్తువులను లబ్ధిదారులకు ఉచితంగా అందజేశారు. వీల్ చైర్స్, చేతి కర్రలు, ట్రై సైకిళ్లు తదితర వస్తువులు అందించారు.

సంబంధిత పోస్ట్