రాజోలు: ప్రభుత్వం పిలిస్తే యుద్ధానికి సిద్ధం

ప్రభుత్వం నుంచి పిలుపు వస్తే యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నానని రాజోలు మండలం సోంపల్లికి చెందిన మాజీ సైనికుడు జిల్లెల్ల శ్యాంప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, భారత్ తరఫున యుద్ధానికి అవసరమైతే సేవలందిస్తానని శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. 18 ఏళ్లు ఆర్మీలో పనిచేశానన్నారు. ఇండియా తరపున యుద్ధంలో పోరాడేందుకు ఆసక్తి ఉందన్నారు.

సంబంధిత పోస్ట్