రాజోలు మండలం పరిధిలోని పలు గ్రామాలలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంట కోత దశకు వచ్చిన నేపథ్యంలో కురిసిన వర్షంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతవరణ శాఖ చరవాణులకు సందేశాలు పంపించింది.