రాజోలు మండలం చింతలపల్లి కళింగుల వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో శివకోడుకు చెందిన కుసుమ చందు (23) మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న చందును ఎదురుగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడు అవివాహితుడు కాగా, తల్లిదండ్రులు గల్ఫ్ దేశంలో ఉంటున్నారు. 108 సిబ్బంది మృతిని ధృవీకరించారు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.