ఆషాడ ఏకాదశి సందర్భంగా రాజోలులో వేంచేసి ఉన్న వనుములమ్మ అమ్మవారికి శ్రీవాసవి కోలాట భజన సంఘం ప్రతినిధులు బుధవారం సారె సమర్పించారు. అమ్మవారి సమక్షంలో విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, కోలాటం ప్రదర్శించారు. కోదాటి దుర్గ ఆధ్వర్యంలో సభ్యులు అమ్మవారికి చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమలతో పాటు పలు రకాల పిండి వంటలు సమర్పించారు.