పేరుపాలెం బీచ్‌లో విద్యార్థి గల్లంతు..గాలింపు చర్యలు ముమ్మరం

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో ఆదివారం ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన చుట్టుగుల్ల సుభాష్ (17) రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. ఏడుగురు సహచర విద్యార్థులతో కలిసి బీచ్‌కు వచ్చిన సుభాష్, సముద్రంలో స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి కొట్టుకెళ్లి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు అతడి ఆచూకీ లభ్యం కాలేదు.

సంబంధిత పోస్ట్