అంతర్వేదిలో వైభవంగా సప్తనదీ మహా జ్యేష్టాభిషేకం

సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సప్తనదీ మహా జ్యేష్టాభిషేక పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు సజావుగా సాగేందుకు అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, కలశ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ పంచామృత, సప్త నది కలశారాధన జరిపారు. ఈ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్