మలికిపురం మండలం మట్టపర్రు గ్రామం నుంచి కుంతలేశ్వరి అమ్మవారి గుడి వరకు వెళ్లే రహదారిలో భారీ గుంతల వల్ల గురువారం రైస్ మిల్లర్ల నుంచి ఊక తీసుకు వెళుతున్న లారీ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఈ రహదారిపై వెళ్లే వాహనాలు రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని గుంతలు పూడ్చాలని, స్ట్రీట్ లైట్లు వేయాలి అని గ్రామస్థులు కోరుతున్నారు.