మలికిపురం మండలం లక్కవరం పీహెచ్సీ సమీపంలో ప్రధాన రహదారిపై మంగళవారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ లపై వెళ్తున్న యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక బైకు రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకుపోయింది. గాయపడిన వారిని రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారు గూడపల్లికి చెందిన వారుగా స్థానికులు చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.