అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం గ్రామానికి చెందిన సుమారు 30 కుటుంబాలు శుక్రవారం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో వీరంతా టీడీపీలో చేరారు. అమూల్య వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.