కాకినాడ, తునిలోని ఉమెన్స్ కాలేజీలో బల్లి పడటంతో 19 మంది విద్యార్థినులకు వాంతులు, విరోచనాలు అయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అందరూ కోలుకోవడంతో కళాశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. బల్లి పడటం వల్ల ప్రాణాపాయం ఉండదని, చర్మంపై ఉండే బ్యాక్టీరియా వల్ల అలర్జీ వంటి సమస్యలు రావచ్చని వైద్యులు తెలిపారు.