తుని మండలం కె. సీతయ్య పేటలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సూరాడ నూకరత్నం (26) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నూకరత్నం భర్త శివ విషప్రయోగం చేసి హతమార్చినట్లు మృతురాలి తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.