పదో తరగతి టాపర్లకు మంత్రి లోకేష్ చేతుల మీదుగా సన్మానం

కాకినాడ జిల్లా తుని గర్ల్స్ హైస్కూల్లో చదివి, పదో తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రంలోనే రెండవ ర్యాంకు సాధించిన పత్రి హర్షిణి (595 మార్కులు), దాడి భాను క్రాంతి (594 మార్కులు)లను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోని సెక్రటేరియట్ లో 'షైనింగ్ స్టూడెంట్స్' కార్యక్రమంలో భాగంగా సన్మానించి అభినందించారు. వారికి 30 వేల నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి ప్రతిభ చూపిన విద్యార్థులను లోకేష్ సత్కరించారు.

సంబంధిత పోస్ట్