కాకినాడ, తునిలోని లోవకొత్తూరు గ్రామంలో రైతులకు నాసా సంస్థ ఆధ్వర్యంలో సేంద్రీయ వ్యవసాయంలో నూతన పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. ఈరోజు, ఘన, ద్రవ జీవమృతాలను అందుబాటులో ఉండే వస్తువులతో ఖర్చు లేకుండా తయారుచేసుకుని పంటలకు ఎలా ఉపయోగించుకోవాలో ఏ.పి.సి.ఎం.ఎఫ్ సిబ్బంది చిన్న కుమారి రైతులకు వివరించారు. నాసా ఫీల్డ్ కోఆర్డినేటర్ పద్మ అధిక లాభాలు వచ్చే అంతర పంటల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వడ్లమూరి రాజు, లంక వెంకటలక్ష్మి, స్థానిక రైతులు, ఫీల్డ్ కోఆర్డినేటర్ అప్పారావు పాల్గొన్నారు.