ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లో దొంగతనం..ఇద్దరు అరెస్ట్

తుని జీఆర్‌పీ SI సత్తిబాబు తెలిపిన వివరాల ప్రకారం, ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన దొంగతనం కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఆదివారం విశాఖ వైపు వెళ్తున్న రైలులో ఈ దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుల నుంచి 12 గ్రాముల బంగారు చైన్‌తో పాటు రూ. 3 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్