తుని పట్టణంలో దొంగలు హల్‌చల్ చేశారు. శనివారం తెల్లవారు జామున రెండుగంటల ప్రాంతంలో మెయిన్ రోడ్ లోని మసీద్ వద్ద ఉన్న ఓ షాపు డోర్ లేపేందుకు విఫలయత్నం చేశారు. పక్కనే ఉన్న మరో షాపును కూడా లూటీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆరుగురు యువకులు ముఠాగా ఏర్పడి దొంగతనానికి ప్రయత్నించారు. ఈ దృశ్యం సీసీ టీవీ కెమెరాలో నమోదైంది. రెండ్రోజుల క్రితం దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.