తొండంగి: ఆటో బోల్తా పడి మహిళలకు గాయాలు

తొండంగి మండలం పైడికొండ వద్ద శనివారం ఆటో బోల్తా పడి పలువురు మహిళలకు గాయాలయ్యాయి. 20 మంది మహిళలతో ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. వీరందరూ ఓ రొయ్యల సీడ్స్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్తున్నట్లు పలువురు తెలిపారు. వీరిని 108లో తుని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారు అనకాపల్లి జిల్లా రామభద్రపురం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్