తుని మండలం ఎర్రకొనేరు జాతీయ రహదారిపై శనివారం ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ఓ మోటారు సైక్లిస్ట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న తుని రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైవే సిబ్బంది ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.