తేటగుంట 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతులు, చెట్ల కొమ్మలు తొలగింపు కారణంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జగ్గంపేట ఈఈ వీరభద్రరావు ఓ ప్రకటన తెలిపారు. తేటగుంట, రాజులకొత్తూరు, తిమ్మాపురం, వెంకటాపురం, గవరపేట, ఎర్రకోనేరు, రాజుపేట, డీజీపురం గ్రామాల్లో కరెంటు సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు తమకు సహకరించాలని కోరారు.