ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. అనకాపల్లి సమీపంలో ఆరుగురు దుండగులు కత్తులు చూపిస్తూ ప్రయాణికులను బెదిరించి, ₹30, 800 నగదుతో పాటు 3 సెల్ఫోన్లను దోచుకెళ్లారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బాధితులు ఆన్లైన్లో, అనంతరం విశాఖ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి కేసు తుని జీఆర్పీ పోలీస్ స్టేషన్ కు బదిలీ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.