తుని డిగ్రీ కాలేజీ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. రాజమండ్రి అపోలో ఫార్మసీకి చెందిన ఐదుగురు ఉద్యోగులు, విశాఖలో ఓ మీటింగ్ కు వెళ్లి కారులో రాజమండ్రికి తిరిగి వస్తున్నారు. తుని డిగ్రీ కాలేజీ వద్ద ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్ఐ కృష్ణమాచార్యులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.