తుని: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గొల్లప్రోలు మండలం మల్లవరం రైల్వే గేట్ వద్ద ట్రైను ఢీకొని వ్యక్తి (45) మృతి చెందాడని ఎస్సై శ్రీనివాసరావు సోమవారం మీడియాకు తెలిపారు. మృతుడు శరీరంపై ఎటువంటి దుస్తులు లేవని, కుడి చేయిపై పెద్ద సైజు టాటూ, స్టీల్ కడియం ధరించి ఉన్నాడన్నారు. మృతుడు వివరాలు తెలిస్తే తుని జీఆర్పీ స్టేషన్లో సంప్రదించాలన్నారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్