తుని పట్టణ శివారు బాలయోగి మెట్ట సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో గుర్తుతెలియని వ్యక్తి (55) బుధవారం మృతి చెందాడని జీఆర్పీ ఎస్ఐ జి. శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. మృతుడు ఎవరనేది తెలియరాలేదని, కుడి మోచేతి పై శ్రీరాములు అనే పేరు పచ్చబొట్టు ఉందన్నారు. పూర్తిగా చిద్రమైన మృతదేహాన్ని తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని, వివరాలకు జీఆర్పీ స్టేషన్లో సంప్రదించాలన్నారు.