తుని పట్టణంలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఎంఆర్ పేటలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలం సీతంపేట గ్రామానికి చెందిన రూత్తల లీలా మాధవ్ (23) ఉరివేసుకొని మృతి చెందాడు. మృతుడు మాధవ్ డెక్కన్ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ గీతారామకృష్ణ తెలిపారు.