కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు శంఖవరం మండలం కె కొత్తూరుకు చెందిన కర్ర శివాజీ, పలివేల రాజుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.