రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

తుని–గుల్లుపాడు రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం జరిగిన విషాద ఘటనలో సుమారు 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడు నీలం రంగు ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నీలం రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఆయన వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో మృతుడి వివరాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.

సంబంధిత పోస్ట్