మా అన్నను చంపింది కోట వినుత వాళ్లే: రాయుడి చెల్లి (వీడియో)

AP: తన అన్న రాయుడిని శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌ఛార్జ్ కోట వినుత వాళ్లే చంపారని అతడి చెల్లెలు అన్నారు. హత్య కేసును కావాలనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద నెడుతున్నారని ఆరోపించారు. పక్కా ప్లాన్‌తో రాయుడిని చంపేశారని, రూ.లక్షలు ఖర్చు చేసి పెయిడ్ వీడియోలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తన అన్న బతికి ఉన్నప్పుడు బెదిరించి వీడియో తీయించుకున్నారని, రాయుడు వాడిన ఫోన్‌ని తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్