విద్యుత్ వైర్లు తెగి మీద పడి అవనిగడ్డ తొమ్మిదో వార్డులో ఆ వార్డుకు చెందిన చందన ప్రభాకర్ రావు శుక్రవారం ఉదయం అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ప్రాంతంలో రెండు పర్యాయాలు ఒకసారి ఒక గేదె, రెండోసారి రెండు గేదెలు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. రెండు సంవత్సరాల వ్యవధిలో మూడు సంఘటనలు జరిగాయి. ప్రభాకర్ రావు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.