అవనిగడ్డ: ఎడ్లంకలో అగ్ని ప్రమాదం పూరిల్లు దగ్ధం

అవనిగడ్డ మండలం ఎడ్లంక గ్రామానికి చెందిన మునిపల్లి బాలస్వామి నివాస గృహం పూర్తిగా కాలి బూడిదైంది. గురువారం అర్ధరాత్రి దాటాక మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పాత టేకు కలప, పూర్వ కాలపు బీరువా, పలు వస్తువులు కాలి బూడిదయ్యాయి. మనమరాలు డెలివరీ అవ్వడంతో ఇద్దరు వృద్దులు ఆమె దగ్గరకు వెళ్ళి ఇంట్లో లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోవా గోవర్ధన్ సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్