ఉత్తమ ప్రసూతి సేవలు అందించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. బుధవారం అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నూతన గైనకాలజిస్ట్ డాక్టర్ బండి నాగశ్రీ ఎమ్మెల్యే బుద్ధప్రసాదును వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్తమ సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ పాల్గొన్నారు.