అవనిగడ్డ: సూపర్ సేవింగ్స్ గురించి విస్తృత ప్రచారం చేయాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూపర్ జీఎస్టీ అమలు ప్రకారం తగ్గిన ధరలు అమలయ్యేలా చూడాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం అవనిగడ్డలో ఆయనను నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, కమర్షియల్ టాక్స్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ స్వరూపరాణి కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ప్రకారం వ్యాపారులు ధరలు తగ్గించి విక్రయించేలా చూడాలని కోరారు. ఈ చర్యల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్