చల్లపల్లి : ప్రమాదంలో చల్లపల్లి వాసి మృతి

జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్పూర్లో జరిగిన ప్రమాదంలో చల్లపల్లికి చెందిన లారీడ్రైవర్ మిరియాల శివకృష్ణ(34) దుర్మరణం చెందారు. ఈ సంఘటనతో చల్లపల్లిలో విషాదం అలుముకుంది. స్థానిక నారాయణరావు నగర్లో నివసిస్తున్న శివ కృష్ణ లారీ డ్రైవర్ గా నిధులు నిర్వహిస్తున్నారు. పని నిమిత్తం వెళ్లిన క్రమంలో అక్కడ జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. మంగళవారం మృతదేహం చల్లపల్లి రానుంది.

సంబంధిత పోస్ట్