చల్లపల్లి మండలం నిమ్ముగడ్డకు చెందిన నాగబాబు కుమారుడు గౌతమ్ (6) ట్రాక్టర్పై నుంచి పడి మృతిచెందిన ఘటన మంగళవారం జరిగింది. గౌతమ్ స్నేహితులతో కలిసి కరకట్ట రోడ్డులో ఆడుకుంటూ ఖాళీ స్థలంలో నిలిపి ఉంచిన ట్రాక్టర్ ఎక్కాడు. తాళం తిప్పగానే ట్రాక్టర్ స్టార్ట్ అయి ముందుకు కదలడంతో గౌతమ్ కిందపడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.