చల్లపల్లి: విగతజీవిగా మారిన అదృశ్యమైన వృద్ధురాలు

ఈనెల 8వ తేదీన కనిపించకుండా పోయిన చోరగుడి బేబి (65) అనే వృద్ధురాలు విగతజీవిగా దర్శనమిచ్చింది. పమిడిముక్కల మండలం పెనుమత్స గ్రామానికి చెందిన చోరగుడి బేబికి ఆరోగ్య సమస్యలున్నాయి. బుధవారం పురిటిగడ్డ పరిధిలోని పొలంలో పనిచేస్తున్న కుమార్తె సీతామహాలక్ష్మి, కూలీలకు బేబి మృతదేహమై కనిపించింది. తల్లి మరణించిన విషయాన్ని సోదరునికి సమాచారం అందించారు. చల్లపల్లి ఎస్ఐ పిఎస్వి. సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్