ఘంటసాల: కేఈబీ కెనాల్ లో విద్యార్థి గల్లంతు

ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామ సమీపంలోని కేఈబీ కెనాల్లో గురువారం విద్యార్థి గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పత్తిపాటి వెన్నెల బట్టలు ఉతికేందుకు సాయంత్రం కాలువ వద్దకు వెళ్లగా, ఆమె వెంట వచ్చిన కుమారుడు పవన్ (15) కాలువలోకి స్నానం చేసేందుకు దిగాడు. కాలువలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో కొద్ది దూరం కొట్టుకుపోయిన పవన్ గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్