రాష్ట్రంలో సంక్షేమ సుపరిపాలన కొనసాగుతుందని కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు అన్నారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం శనివారం ఘంటసాల గ్రామంలోని నందం బజార్లో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కరపత్రాలు ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.