కోడూరు: తహశీల్దార్ శ్రీను నాయక్ బదిలీ

కోడూరు మండల తహశీల్దార్గా విధులు నిర్వహిస్తున్న శ్రీను నాయక్ బదిలీ అయ్యారు. సాధారణ బదిలీలలో భాగంగా గుడివాడ డివిజన్ పరిధిలోని పెదపారుపూడికి బదిలీపై వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం కోడూరు మండల రెవెన్యూ సిబ్బంది ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు. కోడూరు మండలంలో పనిచేసినన్ని రోజులు మండల ప్రజలకు విశేష సేవలు అందించి ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్