మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి గురువారం రాత్రి నిర్వహించిన తెప్పోత్సవంలో దేవాదాయ శాఖ సిబ్బంది అత్యుత్సాహం కనిపించింది. ప్రోటోకాల్ నిబంధనలకు మంగళం పాడారని పలువురు భక్తులు వాపోయారు. ఒక్కసారిగా ఎక్కేందుకు ప్రయత్నించటంతో బల్లకట్టు కదిలాయి. దీంతో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా అంత మందిని ఎందుకు అనుమతించారు అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు.