మోపిదేవి: అరటి తోటల్లో చెలరేగిన మంటలు

మోపిదేవి మండలం పెదప్రోలు పంచాయతీ శివారు శివరామపురం గ్రామంలో అరటి తోటలో మంగళవారం రాత్రి మంటలు రేగాయి. స్థానికులు ఈ విషయాన్ని రైతులకు తెలపడంతో హుటాహుటిన ప్రాంతానికి వచ్చి మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. మంటలు మిగతా అరటి తోటలకు వ్యాపించకుండా జాగ్రత్తలు పాటించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియక రైతులు ఆందోళనలో చెందారు.

సంబంధిత పోస్ట్