అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం మర్రిపాలెం గ్రామంలో వయోవృద్ధురాలు చెరువులో పడి అనుమానాస్పద మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతురాలి ఒంటిపై గాయాలు స్థానికులు గుర్తించారు. ఇంట్లో వృద్ధురాలిపై దాడి చేసి ఎవరో చంపి దగ్గరలో గల చెరువులో మృతదేహాన్ని పడవేసినట్లుగా సమాచారం. మృతురాలి నివాసంలో భారీగా నగదు బంగారం చోరీకి గురైనట్లు కూడా తెలుస్తుంది. స్థానికులు బుధవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు.