చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఆసుపత్రిలోకి వెళ్లాలంటే భయపడేలా మద్యం సేవించి తాను తెచ్చుకున్న బ్లేడ్ తో శరీరంపై గాయపరచుకుంటూ రోగులను భయాందోళనకు గురిచేశాడు. ఆసుపత్రి సిబ్బంది అతని వారించినప్పటికీ మొండితనంగా చేతులపై బ్లేడుతో కోసుకుంటూ తీవ్ర రక్తస్రావంతో భయాందోళన కలిగించాడు. చల్లపల్లి గ్రామానికి చెందిన శివ మద్యం మత్తులో ఇలా వీరంగం సృష్టించాడని సిబ్బంది తెలిపారు.