ప్రపంచశాంతి దినోత్సవం సందర్భంగా సోమవారం ఘంటసాలలో అహ్మదీయ ముస్లిం జమాఅత్ ఇండియా ఆధ్వర్యంలో “STOP WORLD WAR3” శాంతి ప్రచారం నిర్వహించారు. యుద్ధాలు, అణ్వాయుధాల వల్ల మానవాళికి కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జమాఅత్ ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ శాంతి సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు. కృష్ణా జిల్లా ఇన్చార్జ్ యాకుబ్ పాషా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ శాంతి, ప్రేమ, సోదరభావం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం సాహెబ్, ఘంటసాల మసీదు గురువు ముహమ్మద్ ఇస్మాయిల్, బాబావలి, కమ్రుద్దీన్ పాల్గొన్నారు.