కోల్ కొత్తా-చెన్నై జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదం జరిగింది. బాపులపాడు మండలం అంపాపురం వద్ద ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు, ట్రక్ ఆటో ఢీకొట్టుకున్నాయని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఆటోలోని వ్యక్తి మధ్యలో ఇరుక్కుపోవడంతో స్థానికులు బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.